కురుమ జాతిని గౌరవించింది బీఆర్ఎస్​ ఒక్కటే: మాజీ మంత్రి హరీశ్​రావు

కురుమ జాతిని గౌరవించింది బీఆర్ఎస్​ ఒక్కటే: మాజీ మంత్రి హరీశ్​రావు
  •     తెల్లాపూర్ ​బీరప్ప జాతరలో మాజీ మంత్రి హరీశ్​రావు

రామచంద్రాపురం, వెలుగు: కురుమ జాతిని గౌరవించి, వారికి సముచిత స్థానం కల్పించిన ఏకైన పార్టీ బీఆర్ఎస్​అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​ రావు అన్నారు. తెల్లాపూర్​ మున్సిపాలిటీలో సోమవారం జరిగిన బీరప్ప జాతరకు ఆయన హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్​ అధికారంలో ఉన్న పదేళ్లు కురుమలను ఆదరించారని గుర్తు చేశారు. కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి మొదటి సారిగా ఓ కురుమనే చైర్మన్​ చేసిన ఘనత తమదని, వారికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది కేసీఆర్​ అని పేర్కొన్నారు.

మల్లన్నసాగర్​ విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తి చేశామని, నేడు సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. తెల్లాపూర్​లో మాజీ చైర్​ పర్సన్​ లలితా సోమిరెడ్డి చేసిన పోరాటం వల్లే కురుమలకు ఎకరా భూమి కేటాయించామని, భవిష్యత్​లో గుడి అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కురుమ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశం, మాజీ సర్పంచ్​సోమిరెడ్డి, బీఆర్ఎస్​నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, కార్పొరేటర్​ కుమార్​, పీఏసీఎస్​చైర్మన్​ బుచ్చిరెడ్డి, సీనియర్​ నాయకులు బాల్​రెడ్డి, సత్యనారాయణ, దేవేందర్​ యాదవ్​, అంజయ్య, శ్రీకాంత్ గౌడ్​, నర్సింహ, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.